Water release from Sagileru Reservoir: కడప జిల్లా వడ్డమాను చిదానందం దిగువ సగిలేరు జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఎగువ నుంచి 1,200 క్యూసెక్కుల వరద వస్తునట్లు అధికారులు తెలిపారు. దాంతో సగిలేరు నది లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అనంతరం జలాశయం ఐదు గేట్లలో రెండింటిని ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
కడప ఆర్టీసీ గ్యారేజ్‌లో నీటి నిల్వ
Rains in Kadapa: జిల్లాలో భారీ వర్షాలకు కడప ఆర్టీసీ గ్యారేజ్‌లో 20 రోజుల నుంచి వర్షపు నీరు నిల్వ ఉంటోంది. నీటిలోనే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మోకాళ్ల లోతు వరకు నీరు చేరటంతో ఆర్టీసీ బస్సుల మరమ్మతులకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. బద్వేలు పెద్ద చెరువు నాలుగు అడుగుల మేర నీరు పడటంతో రఘునాథపురం గ్రామం చుట్టూ నీరు చేరి రాకపోకలు స్తంభించాయి.
ఇదీ చదవండి