ETV Bharat / state

కోట్లు ఖర్చు చేస్తున్నా.. ప్రజల దాహం తీరడం లేదు..! - కడపలో నీటి కష్టాలు

కడప జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తీరడంలేదు. నీటి సరఫరా కోసం నెలకు రూ.3.10 కోట్లు ఖర్చుపెడుతున్నా ఆ నీరు ప్రజలదాకా చేరట్లేదు. కరవు పరిస్థితుల కారణంగా నీటి కొరత ఏర్పడింది. దీంతో తమను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

water-problems
water-problems
author img

By

Published : Jun 29, 2020, 1:36 PM IST

కడప జిల్లాలో తాగునీటి కొరత కొనసాగుతూనే ఉంది. 2019 డిసెంబరు నెలలో వర్షాలు కురవడంతో జిల్లాలో నీటి సరఫరా గ్రామాల సంఖ్య తగ్గింది. గతంలో వేసవిలో గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను చేసేవారు. 2020 జనవరి నుంచి నిత్యం నీటి సరఫరా కొనసాగుతోంది. వేసవిలో భూగర్భ జలమట్టం తగ్గడంతో గ్రామాలకు నీటి సరఫరా చేసే గ్రామాల సంఖ్య విపరీతంగా పెరిగింది. మార్చిలో 16 మండలాల్లో 186 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు.

తొమ్మిది మండలాల్లో వ్యవసాయ బావుల నుంచి నీటిని అందించారు. మూడు నెలల్లో 581 గ్రామాల్లో నీటి కొరత ఏర్పడింది. ప్రస్తుతం 29 మండలాల్లో 500 గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. 21 మండలాల్లో వ్యవసాయ బావుల ద్వారా 81 గ్రామాలకు నీటిని అందిస్తున్నారు. మార్చిలో నీటి సరఫరా కోసం రూ.కోటి వ్యయం చేయగా ప్రస్తుతం నెలకు రూ.3.10 కోట్లు వ్యయం చేయాల్సి వచ్చింది. వర్షాలు సకాలంలో కురవకపోతే గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది.

తమ గ్రామాలకు నీటిని సరఫరా చేయాలని పలువురు నిత్యం ఆయా మండలాలకు చెందిన ఎంపీడీవోలు, గ్రామీణ నీటిసరఫరా ఇంజినీరింగ్‌ అధికారులకు వినతులిస్తున్నారు. కరవు పరిస్థితుల కారణంగా నీటి కొరత ఏర్పడింది. ఇటీవల భూగర్భ జలమట్టం బాగా తగ్గిందని చెప్పవచ్ఛు

జిల్లాలో కరవు పరిస్థితులు...

2019లో ఏప్రిల్‌లో 15 మండలాల్లో 135 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేశారు.2020 మార్చిలో 16 మండలాల్లోని 229 గ్రామాలకు ట్యాంకర్లు, వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని అందించారు.

ఒక్కో ట్యాంకరుకు రూ.545లు, వ్యవసాయ బావికి రోజుకు రూ.275లు చెల్లిస్తారు.

రాయచోటి నియోజకవర్గంలోనే తీవ్ర కొరత

రాయచోటి నియోజకవర్గంలోనే 259 గ్రామాల్లో నీటి కొరత ఉంది. జిల్లాలో తీవ్ర నీటి కొరత ఉన్న గ్రామాలు ఈ నియోజకవర్గంలోనే అధికం. చిన్నమండెం 75, గాలివీడు 72, లక్కిరెడ్డిపల్లె 53, రాయచోటి 36, రామాపురంలో 10, సంబేపల్లెలో 13 గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. మరికొన్ని గ్రామాలకు వ్యవసాయ బోరుబావులనుంచి అందిస్తున్నారు.

నీటి కొరతను రానివ్వం

అవసరమైన గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నాం. గ్రామాల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా చిన్నమండెం మండలంలో 73, గాలివీడు మండలంలో 72 గ్రామాలకు నీటికొరత ఉంది. అవసరమైన చర్యలు చేపట్టి ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చేస్తాం. దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. - శ్రీనివాసులరెడ్డి, డీఈ గ్రామీణనీటి సరఫరా, పారిశుద్ధ్యశాఖ, రాయచోటి

ఇదీ చదవండి: కశ్మీర్​లో ఉగ్ర ఏరివేత- ముగ్గురు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.