ETV Bharat / state

పొలంలో నీటి కుంట.... ఎండదిక పంట... - పొలంలో నీటి కుంట.... ఎండదిక పంట...

వర్షాలు కురవక సాగునీరు అందక రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముందుచూపు లేక ఇబ్బంది పడుతున్నారు. వేసిన పంట కాపాడుకోలేక వదిలేసుకునే దుస్థితి నెలకొంది. పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని ఉంటే నీటి సమస్య తీరుతుందంటున్నారు అధికారులు. పొలాల్లో కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

పొలంలో నీటి కుంట.... ఎండదిక పంట...
author img

By

Published : Aug 2, 2019, 5:35 PM IST

కడప జిల్లాలో 1,22,310 హెక్టర్లల్లో ఉద్యాన పంటల సాగులో ఉన్నాయి వీటికి సకాలంలో నీటి తడులు అందకుంటే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి రైతు తన పొలంలో కుంట ఏర్పాటు చేసుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉద్యాన శాఖ కొలతల ప్రకారం చిన్న నిర్మాణానికి రూ. 1,50,000లు ఖర్చవుతుంది. ఇందులో రైతు వాటాగా 75 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద కుంట నిర్మాణానికి 20 లక్షల రూపాయలు అవుతుంది. దీనికి పూర్తిగా రాయితీ లభిస్తుంది. అయితే 25 ఎకరాల తక్కువ కాకుండా రైతులు ఉమ్మడిగా ముందుకు వస్తే పెద్ద కుంటలు నిర్మిస్తారు.
పెద్ద కుంటలో సుమారు 30 వేల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు. వర్షాకాలంలో ఇది నిండితే సమీపంలోని బోర్లలో నీటి మట్టం పెరుగుతుంది. వర్షాలు పడిన సమయంలో ఈ కుంటలో నీటిని పొలాలకు అందించుకోవచ్చు. వర్షాలు పడి బోర్లలో నీరు ఉంటే ఆ నీటితో కుంటను నింపుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక గొట్టాలు ఏర్పాటు చేస్తారు. కుంట చుట్టూ కంచె నిర్మిస్తారు.
కడప జిల్లాలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు రైతులు 532 చిన్న కుంటలు నిర్మించుకున్నారు. ఇంకా 172 నిరూపించుకోవాల్సి ఉంది ఇప్పటివరకు సుమారు రూ.3,98,25,000లు ఖర్చు చేశారు. పెద్ద కుంటలు 29 చోట్ల ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఉద్యాన శాఖ 5.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కడప జిల్లా రాజంపేట నుంచి రాయచోటి వెళ్లే మార్గంలో ప్రభాస్ అన్న రైతు ఐదుగురు రైతులతో కలిసి పెద్ద కుంట నిర్మించుకున్నారు.

ఇవీ చదవండి

రేపటినుంచి గండి క్షేత్రంలో శ్రావణమాస ఉత్సవాలు

Intro:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయంలో దేవతామూరి ఎదుట గుమ్మానికి చెన్నై భక్తులు రూ.1.50కోటీతో తయారు చేయించిన బంగారు తాపడం ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఆలయంలో పూజలు చేసి దీనిని ప్రారంభించారు. అక్కడి నుంచి తడ.దొరవారిసతరం మండలాల్లో సాగునీటి కాలువలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చెంగాళ పరమేశ్వరి ఆలయం అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు. ఆయన ఎమ్మెల్యే సంజీవయ్య నాయకులు పాల్గొన్నారు

Body:సూళ్లూరుపేట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.