ETV Bharat / state

వివేకా హత్య కేసులో కీలక మలుపు - ఆయన కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐ ఎస్పీపై కేసు నమోదు - Case filed on CBI Ram singh in Viveka murder case

Viveka Murder Case Latest Update: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డితో పాటు కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు. తనను కొందరు బెదిరిస్తున్నారని వివేకా పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Viveka_Murder_Case_Latest_Update
Viveka_Murder_Case_Latest_Update
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 9:34 AM IST

Viveka Murder Case Latest Update: చాలా నెలల తర్వాత మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేక హత్య కేసు దర్యాప్తు చేసిన సీబీఐఎస్పీ రామ్ సింగ్​తో పాటు వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాలతో వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ముగ్గురుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం సంచలనం కలిగించింది.

వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త మలుపు: వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy) ఆయన పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్​సింగ్ పైన సైతం పులివెందుల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద ఈనెల 15న కేసు నమోదు చేశారు.

కడప ఎస్పీని కలిసిన వైఎస్‌ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి

పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సునీత, రాజశేఖర్, సీబీఐ ఎస్పీ రామ్​సింగ్​పైన ఐపీసీ 156, 352, 323, 330, 342, 348, 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 2021 ఫిబ్రవరిలో వివేక పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. ఆరుగురు నిందితులపై చర్యలు తీసుకోవాలని గతంలో ఆయన పిటిషన్​లో పేర్కొన్నారు. వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్, బీటెక్ రవితో పాటు మరో ముగ్గురుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

వివేక హత్య కేసులో విచారణ సందర్భంగా సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను కడపలో తీవ్రంగా హింసించారని పిటిషన్​లో వెల్లడించారు. తన కుమారుల ఎదురుగానే కర్రలతో చితకబాదారని పేర్కొన్నారు. వివేక హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పలుమార్లు తనను బెదిరించారని కృష్ణారెడ్డి ఫిర్యాదులో తెలియజేశాడు.

CBI Charge Sheet: వివేకా హత్యకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కుట్ర : సీబీఐ

ఇదే సందర్భంలో హైదరాబాద్​లో సునీత ఇంటికి వెళ్లిన సందర్భంలో కూడా సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి తనని బెదిరించినట్లు పేర్కొన్నారు. సీబీఐ రామ్​సింగ్ చెప్పినట్లు సాక్ష్యం చెప్పాలని సునీత గట్టిగా మందలించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఇదే అంశంపై కడప ఎస్పీకి కూడా 2021లో ఫిర్యాదు చేశారు. కృష్ణారెడ్డి వేసిన ఫిర్యాదు మేరకు పులివెందుల కోర్టు విచారణ జరిపి సీబీఐ ఎస్పీ రాంసింగ్,​ సునీత, రాజశేఖర్ రెడ్డిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎంవీ కృష్ణారెడ్డి నుంచి ఫిర్యాదు తీసుకున్న పులివెందుల పోలీసులు ముగ్గురిపై ఈనెల 15వ తేదీన కేసు నమోదు చేశారు.

Viveka murder case: వివేక హత్య వార్తను జగన్‌కు ఎవరు చెప్పారు? సీబీఐ విచారణలో కీలక సాక్షుల వాంగ్మూలాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.