వైఎస్ వివేకా హత్య కేసులో 17వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ అధికారులు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని మరోసారి విచారిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో సీబీఐ అధికారులు మాజీ డ్రైవర్ను ప్రశ్నించడం ఇది మూడోసారి. కాగా మంగళవారం వైకాపా కార్యకర్త చిన్నపరెడ్డిని విచారించారు.
పులివెందులలో అధికార పార్టీకి చెందిన ఓ కుటుంబాన్ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వైకాపాకు చెందిన కృష్ణయ్య, సావిత్రి అనే దంపతులతో పాటు.. వారి ఇద్దరు కుమారులు సునీల్ కుమార్, కిరణ్ కుమార్, కుమార్తె నందిని సీబీఐ విచారణకు హాజరయ్యారు.
సంబంధిత కథనాలు:
viveka murder case: వివేకా హత్య కేసు.. 16వరోజు కొనసాగుతోన్న విచారణ