కడప జిల్లా ప్రొద్దుటూరులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండీ కాంప్లెక్స్‌లోని ఓ దుకాణంలో.. అలాగే ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని మరో మూడు డాల్ మిల్లులో సోదాలు చేశారు. అందులో భాగంగా 30 కేజీల బస్తాల్లో తూకాలు తేడాలు రావడంతో కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ దస్తగిరిబాబు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పప్పుదినుసులను నిల్వ చేసి.. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :