వసతి గృహంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - కడపలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు
కడప జిల్లా ఖాజీపేట ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల హాజరుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వారికి అందించే ఆహారంతో పాటు సరుకుల నిల్వ పైనా ఆరా తీశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆహారం సరఫరా, మెనూ పాటించడం వంటి అంశాలపై విచారించారు.