కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం వడ్డేపల్లిలో నాలుగు రోజుల కిందట జరిగిన రైతు హత్య కేసులోని నిందితులను... పోలీసులు అరెస్టు చేశారు.
- అసలేం జరిగింది....?
రాయితీ వేరుశెనగ విత్తన కాయలు కొనుగోలు చేసిన శంకరయ్యపై అదే గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీనివాసులు బంధువులు... డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో రెడ్డయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి శంకరయ్య తిరిగి స్వగ్రామానికి వస్తుండగా... మార్గ మధ్యలో మారణాయుధాలతో గ్రామ వాలంటీర్ శ్రీనివాసులు, మరి కొంతమంది మాటు వేసి దాడి చేసి హతమార్చారని సీఐ లింగప్ప తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సురేంద్ర, మహేష్‌లను వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
- నిందితుల్ని ఎలా పట్టుకున్నారు..?
ముందస్తు సమాచారంతో రాయచోటి గాలివీడు ప్రధాన మార్గంలోని... రామాపురం క్రాస్ వద్ద మాటువేసి నిందితులను అరెస్టు చేశారని సీఐ వివరించారు. వారి నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకొని... కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ మద్యానికి రాష్ట్ర సరిహద్దుల్లోనే బ్రేక్