UP man suicide in kadapa: కడప శివారులోని బాకరాపేట సమీపంలో.. యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అవినాష్ కుమార్.. ఆరు నెలల కిందట కడపకు వచ్చి కార్పెంటర్ పని చేస్తూ బతుకీడుస్తున్నాడు. తోటి స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో కూడా పాల్గొన్నాడు.
ఉన్నట్టుండి ఇవాళ రైలు కింద పడి అవినాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కడప రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలయాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం.. మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
Train Accident at Kurnool: రైలు ప్రయాణిస్తుండగా.. ఊడిపోయిన ఇంజిన్..!