కడపకు చెందిన మస్తాన్, మోహన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించేవారు. అందులో భాగంగా..ఆ ఇద్దరు తమ బైకులను పట్టణంలోని బస్టాండ్లోని పీఎన్ఆర్ లాడ్జి ఆవరణంలో పార్కింగ్ చేశారు. అయితే ఆకతాయిలు తాగిన మైకంలో ఆ వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గమనించిన స్థానికులు... అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే రెండు వాహనాలు కాలి బూడిదయ్యాయి.
ఈ ప్రమాదంలో సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్న బాధితులు...1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పెట్రోల్ సీసా లభించడం వల్ల పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: