కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020 ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకిస్తూ కడప జిల్లా మైదుకూరులో కార్మికులు ఆందోళన చేశారు. తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు డివిజన్ కార్యాలయం ఎదుట యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు వలన రాష్ట్ర విద్యుత్ సంస్థలు, రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర పరిధిలోకి వెళతాయని, దీంతో రాయితీ రాకపోవటంతో వినియోగదారులపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిధిలో ఉన్న డిస్కంలు, కేంద్రం పరిధిలోకి వెళ్తే, డిస్కంలు నష్టాలు వస్తాయన్నారు. దీని వలన విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు నష్టపోతారని వాపోయారు.
ఇదీ చదవండి: ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ ప్రారంభం