బద్వేలు భాజపా అభ్యర్థి సురేష్ తరఫున ప్రచారం నిర్వహించడానికి కేంద్ర సహాయ మంత్రి మురుగన్ బద్వేల్‌కు విచ్చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకుని ప్రజలు భాజపాకే ఓటెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని.. దీనికి అడ్డుకట్ట వేయాలంటే... భాజపా అభ్యర్థి సురేష్ ను అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.
బద్వేలు పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు రోడ్ షో నిర్వహించారు. ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన సురేష్ వెనుక ప్రధాని మోదీ ఉన్నారనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలియజేశారు. బద్వేలు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు పెరిగిపోయాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.
ఇదీ చదవండి: '100 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు'