ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు పెరిగాయి: కేంద్ర హోంశాఖ

Union Home Ministry report: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై రకరకాల దాడులు గత మూడేళ్ళలో పెరిగాయని కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోం శాఖ సహాయ మంత్రులు నిత్యానందరాయ్‌, అజయ్‌మిశ్రాలు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో ఈ విషయం వెల్లడైంది.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు
Union Home Ministry report
author img

By

Published : Dec 13, 2022, 8:58 PM IST

Atrocities on women in AP increased: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై రకరకాల దాడులు గత మూడేళ్ళలో పెరిగాయని కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. మహిళల మిస్సింగ్‌, అత్యాచారాలు, దొంగతనాలు, డెకాయిటీలు పెరిగినట్లు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోం శాఖ సహాయమంత్రులు నిత్యానందరాయ్‌, అజయ్‌మిశ్రాలు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో ఈ విషయం వెల్లడైంది. 2017లో 18ఏళ్ల పైబడిన మహిళలు కనిపించకుండా పోయిన కేసులు 5,933 వరకు నమోదు అయితే... 2018లో 5703కి తగ్గిందని, తిరిగి 2019 నుంచి 2021 వరకు క్రమంగా పెరిగిందని లేఖలో మంత్రులు పేర్కొన్నారు.

లోకభకు ఇచ్చిన సమాధానాల ప్రకారం.. ఈ మూడేళ్లలో 22వేల 278 మంది మహిళలు మిస్సింగ్ అయినట్లు వెల్లడైంది. 2019లో 6252 మంది, 2020లో 7057 మంది, 2021లో 8969 మందిగా నమోదైనట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ మూడేళ్ల కాలంలోనే అత్యాచారాలు 9.39 శాతం, దొంగతనాలు 4.6 శాతం, డెకాయిటీలు 85 శాతం పెరిగాయని హోం శాఖ వెల్లడించింది. ఇదేకాలంలో.. దోపిడీలు 16.45 శాతం, చిన్నారుల కిడ్నాపులు 6.52 శాతం వరకు తగ్గినట్లు పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.