సృష్టికి విరుద్ధమైనా అతనే కావాలంటూ నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయికుమార్ అనే యువకుడు కడప జిల్లా మైదుకూరులో హల్‌చల్ చేశారు. ఆ యువకుడిని తన వద్దకు చేర్చి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. సాయికుమార్ చెప్పిన వివరాల మేరకు.. దుబాయ్‌లో ఉపాధి పొందుతున్న తనకు మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్న మైదుకూరు యువకుడితో టిక్‌టాక్ ద్వారా పరిచయమైందన్నారు. సెల్‌ఫోన్ నెంబరు తీసుకుని పరస్పరం మాట్లాడుకుంటూ వచ్చామన్నారు.
"ఆ యువకుడు నీవంటే నాకు చాలా ఇష్టమని, నీవు లేకపోతే నేను బతకలేనంటూ చెప్పి లేనిపోని భరోసా ఇచ్చాడు. తనను దుబాయ్ నుంచి మస్కట్‌కు వచ్చేలా చేసి పెళ్లి చేసుకున్నాడు. విదేశాల నుంచి వచ్చాక తనకు దూరమయ్యాడు. ఆపై మైదుకూరు చేరుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు."
-కంది సాయికుమార్
పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేయగా యువకుడి బంధువులే వైద్యం చేయించారని వివరించారు. యువకుడు తన వద్ద ఒకరకంగా మాట్లాడుతున్నారని, తల్లిదండ్రుల వద్ద మరో రకంగా మాట్లాడుతున్నారన్నారు. అతను లేకపోతే తాను బతకలేనంటూ చెప్పారు. తమను ఒకటి చేయాలంటూ వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: పెళ్లయ్యాక భార్య.. మహిళ కాదని తెలిస్తే..