పొలం దగ్గరకు నాన్నకు అన్నం ఇచ్చి తిరిగి వస్తూ.. కనిపించిన నీటి కుంటలో ఈత కొట్టడానికి సరదాగా దిగారు. ఆ సరదానే వారి ప్రాణాల్ని తీసుకుంది. కడప జిల్లా రాజంపేట మండలం బగిడిపల్లి నీటికుంటలో ఇద్దరు చిన్నారులు ఈతకోసం దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
బగిడిపల్లికి చెందిన సులోచన, సుబ్బరాయుడు దంపతుల ఇద్దరు పిల్లలు సురేష్ (13), సిద్దయ్య(10)లు నాన్నకు మధ్నాహ్న భోజనం ఇచ్చి.. తిరుగు ప్రయాణంలో ఓ నీటి కుంటలోకి దిగారు. నీటిలో దిగాక పిల్లలిద్దరికి ఊపిరాడక మరణించారు. దీంతో బగిడిపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పరిశీలించి వివరాలను వెల్లడించారు. సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.
ఇదీచూడండి. గొడవ చిన్నది.. శిక్ష పెద్దది!