ఈ ఘటన కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఎస్. కొత్తపల్లిలో గాలి పంపు విరగొట్టాడని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్వల్పంగా మొదలైన ఈ వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. జరిగింది.
గాలి పంపు సాకుతో పాతకక్షలు దృష్టిలో ఉంచుకొని ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై వెంకట నరసింహం తెలిపారు.
ఇదీ చదవండి :