స్నేహితుని తండ్రి కర్మకాండకు గురువారం కడప జిల్లా సిద్ధవటం వచ్చిన తిరుపతి యువకులు పెన్నా నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. ప్రారంభంలో లోతు పెద్దగా లేకపోవటంతో క్రమంగా లోపలికి వెళ్లిన యువకుల్లో ఒకరు మునిగిపోతుండగా... కాపాడే క్రమంలో ఏడుగురు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. కళ్లెదుట బిడ్డల మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.
మరో రెండు మృతదేహాల కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రెండు బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: