భాజపాపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తామని అంటున్న భాజపా నేతలు.. 2019లో కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏపీకి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సన్నిధిలో వాగ్దానం చేసి.. ఇప్పుడు దాన్ని ముగిసిన అధ్యాయం చేశారని ధ్వజమెత్తారు.
పునర్ వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి రూ. 24,350 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 1,050 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కడప ఉక్కు కర్మాగారం ఊసే ఎత్తడంలేదని ఎద్దేవాచేశారు. విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు పూర్తి ఇవేమీ చేయడంలేదని విమర్శించారు. ఇప్పుడు వచ్చి రాష్ట్రంలో అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని తులసిరెడ్డి ప్రశ్నించారు.
ఇవీ చదవండి..