ETV Bharat / state

Tulasireddy Comments On Bjp: 'కడపలో ఉక్కు పరిశ్రమ సెగలు'.. కేంద్రంపై కాంగ్రెస్​, ప్రజాసంఘాల ధ్వజం

Rcp Agitation Against Bjp: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు లాభాదాయకం కాదని కేంద్రం ప్రకటించడంతో కడపలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉక్కు కర్మాగారం ఏర్పాటు చెప్పడం లాభదాయకం కాదని చెప్పడం 'చావు కబురు చల్లగా చెప్పినట్లు' ఉందని అని కాంగ్రెస్​ మీడియా సెల్​ ఛైర్మన్​ తులసిరెడ్డి అన్నారు. అలాగే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించడంతో కడపలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి.

కేంద్రంపై ధ్వజమెత్తిన కాంగ్రెస్​నేత తులసిరెడ్డి
Tulasireddy Comments On Kadapa Steel plant
author img

By

Published : Jul 26, 2023, 7:22 PM IST

Tulasireddy Comments On Kadapa Steel Plant: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించడంతో కడపలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉక్కు కర్మాగారం ఏర్పాటు చెప్పడం లాభదాయకం కాదని కేంద్రం అనటం 'చావు కబురు చల్లగా చెప్పినట్లు' ఉందని అని కాంగ్రెస్​ మీడియా సెల్​ ఛైర్మన్​ తులసిరెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం అని ఆయన విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ఆయన అన్నారు.

AP state partition issue: 'కడపలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదు..' పార్లమెంట్​లో కేంద్ర హోంశాఖ స్పష్టం

వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కావలసిన అనుకూలతలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయని తులసిరెడ్డి అన్నారు. చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు మండలాల్లో వేల ఎకరాల ప్రభుత్వ ఉందని కావాలి అంటే ఉక్కు కర్మగారాన్ని అక్కడ ఆ నిర్మించవచ్చని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇలానే ప్రత్యేక హోదాకు కూడా పంగనామాలు పెట్టిందని తులసిరెడ్డి గుర్తు చేశారు. అలాగే రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీకి కూడా కేంద్రం తిలోదకాలిచ్చిందని ఆయన అన్నారు. విభజన చట్టంలో చెప్పిన అనేక అంశాలను బీజేపీ అమలుచేయలేదని తులసిరెడ్డి విమర్శించారు.

స్టీల్‌ప్లాంట్‌తో పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి: సీఎం

ఆంధ్రప్రదేశ్​ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన ఆరు నెలల లోపు సెయిల్​ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి. రాష్ట్రం విడిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న ఆ వూసే లేదు. ఇప్పుడేమో సాంకేతికంగా,ఆర్థికంగా సాధ్యం కాదని చెప్పడం దురదృష్టకరం అని తులసి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కడప జిల్లా లో ఉక్కు కర్మాగారం నిర్మిస్తుందని, విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు.

సెయిల్ ఆధ్వర్యంలోనే కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలి

కేంద్రం ప్రకటనతో ఆందోళనకు దిగిన ప్రజా సంఘాలు: ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించడంతో కడపలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఐటీఐ కూడలిలోని గాంధీ విగ్రహం వద్ద రాయసీమ కమ్యూనిస్టు పార్టీ వారి నిరసన తెలియజేసింది. పార్లమెంటులో కడప ఉక్కు కర్మాగారం గురించి కేంద్రం ప్రకటన చేస్తున్న సమయంలో వ్యతిరేకంగా గళం విప్పలేని వైసీపీ ఎంపీలు ఆ సభలో ఉండటం సిగ్గుచేటని ఆర్సీపీ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి మండిపడ్డారు. కడపకు ఉక్కు పరిశ్రమ అనేది ఎవరో ఇచ్చే భిక్ష కాదనీ, ఈ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేని వైసీపీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలనీ... లేదంటే రానున్న రోజుల్లో ఓట్ల అడగడానికి ప్రజలు వద్దకు వెళ్లే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కు పరిశ్రమ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేచ్చెందుకు అఖిల పక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని వారు డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని ఏ అంశాన్ని కేంద్రం అమలుచేయడం లేదని వారు ధ్వజమెత్తారు.

'కడప ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి కావడానికి ఒక్కసారి జగన్‌ బటన్ నొక్కాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.