కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లె మండలంలో రైతులు అధికంగా తమలపాకు పంటను సాగు చేశారు. ఇక్కడి నుంచి తెలంగాణ, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తుంటారు. బస్సు, లారీల ద్వారా వీటిని పంపించేవారు. వాస్తవానికి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వివాహాలు ఉండటంతో పాటు ఆకుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం లాక్‌డౌన్‌తో వీటిని ఇతర ప్రాంతాలకు పంపించే అవకాశం లేకుండా పోయింది.
ఫలితంగా... తోటల్లోనే ఆకులు కోయకుండా వదిలేస్తున్న కారణంగా ముదిరి పండిపోతున్నాయి. తోటల్లో పనిచేసే కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వేంపల్లిలోని ఆకు తోటలను పరిశీలించారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. లాక్‌డౌన్ తో మార్కెటింగ్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమలపాకు రైతులకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: