వైకాపా అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాల్లోనూ ధరలను విపరీతంగా పెంచిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆరోపించారు. గడిచిన 11 నెలల్లో మద్యం, ఇసుక, సిమెంటు ధరలు పెంచారన్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపారని ఆగ్రహించారు. పెట్రోలు, డీజిల్, ధరలు పెంచుకుంటూ పోయారన్నారు. ఇప్పుడు విద్యుత్ చార్జీలు అమాంతంగా పెంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహించారు.
ఒకవైపు లాక్డౌన్ తో కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టంగా ఉంటే... కరెంటు బిల్లులు ఇంత దారుణంగా పెంచడం మంచిది కాదన్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 మాసాల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జులై నుంచి.. విద్యుత్ బిల్లులను అంతకు ముందున్న పాత స్లాబ్ రేట్ల ప్రకారమే వసూలు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: