ETV Bharat / state

వైఎస్ విజయమ్మ మాటలు విడ్డూరంగా ఉన్నాయి: తులసిరెడ్డి - వైఎస్ విజయమ్మ మండిపడ్డ తులసిరెడ్డి

వివేకా హత్యకేసులో ఇంతకాలం మాట్లాడని వైఎస్ విజయమ్మ... ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి దుయ్యబట్టారు.

Tulasi reddy
తులసిరెడ్డి
author img

By

Published : Apr 6, 2021, 8:35 PM IST

రెండు సంవత్సరాల తర్వాత వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మాట్లాడడం విడ్డూరంగా ఉందని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా వేంపల్లెలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం వివేకా హత్య కేసుపై ఎందుకు మాట్లాడలేదని విజయమ్మను తులసిరెడ్డి నిలదీశారు. ఈకేసుపై కేంద్ర ప్రభుత్వం సైతం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మావోయిస్టుల ఘాతుకంపై భాజపా సమాధానమేంటి?

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఫ్రాన్స్​కు చెందిన సంస్థ చెప్పిందని... ఈ విషయంపై భాజపా ఏం సమాధానం చెబుతుందని తులసిరెడ్డి ప్రశ్నించారు. విదేశీ గడ్డపై పాకిస్తాన్​లో సర్జికల్ స్ట్రైక్స్ జరిపామని రొమ్ము విరుచుకుని చెప్పే భాజపా నాయకులు... ఇవాళ సొంతగడ్డపైనా ఛత్తీస్​గఢ్ మావోయిస్టుల చేతిలో దాదాపు 24 మంది జవాన్లు హతమైన ఘటనపై.. ఏం సమాధానం చెబుతారని కేంద్రాన్ని తులసిరెడ్డి నిలదీశారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయండి.. సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.