కడప రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బెంగళూరుకు చెందిన వైష్ణవి, నంద్యాలకు చెందిన ఉషగా రైల్వే పోలీసులు గుర్తించారు. బంధువుల గృహప్రవేశానికని వచ్చిన మహిళలు తెలిసిన వారిని పలకరించి స్థానికంగా ఓం శాంతినగర్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. రైల్వే పట్టాలు దాటితే అక్కడ ఆటోలుంటాయనే ఉద్దేశంతో అంగడివీధి నుంచి వచ్చి మూడో నంబరు ప్లాట్‌ఫాం నుంచి పట్టాలపై నడుచుకుంటూ వస్తున్నారు. రాత్రి సమయం కావడం వల్ల అటుగా వస్తోన్న చెన్నై నుంచి హుబ్లీ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును వీరు గమనించలేదు. అప్పటికే వీరిని ఢీ కొన్న రైలు దాదాపు 20 అడుగుల వరకూ ఈడ్చుకెళ్లింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: