రాష్ట్రంలో కరోనా నియంత్రణకు పోలీసులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిని కొందరు వాహన చోదకులు బేఖాతరు చేస్తోన్నారు. మాస్కులు లేకుండా రోడ్ల పైకి వస్తున్నారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారి కోసం కడప జిల్లా ప్రొద్దుటూరులో... ట్రాఫిక్ కానిస్టేబుల్ మహేష్ అవగాహన కల్పిస్తున్నారు.
మాస్కు ధరించకుండా రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి... మాస్కు కట్టుకున్న తర్వాతే అక్కడి నుంచి పంపుతున్నారు. అటువైపు వెళ్లే వికలాంగులకు స్వయంగా ఆయనే మాస్కు కడుతున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: