ETV Bharat / state

గండికోటకు సందర్శకుల తాకిడి.. సెల్ఫీలతో పర్యాటకుల సందడి - గండికోట వార్తలు

కడప జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన గండికోట పర్యాటకులతో సందడిగా మారింది. పండుగ విరామం, ఆదివారం కలసి రావడంతో సందర్శకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. కొంత ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

tourists at gandikota in kadapa district
సందర్శకులతో గండికోట కళకళ
author img

By

Published : Jan 17, 2021, 8:12 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట పర్యాటకులతో కళకళలాడింది. సంక్రాంతి పండుగతో పాటు ఆదివారం కలిసి రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోటను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులతో నిండిపోయింది.

ఇరుకైనా రోడ్లు కావడంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. కారాగారం, మాధవరాయస్వామి, జుమ్మా మసీదు, రంగనాథస్వామి ఆలయం వద్ద పర్యాటకులు సందడి చేశారు. మరికొంతమంది కోనేరులో దిగి చేపలతో ఆడుకున్నారు. పెన్నా లోయ, జుమ్మా మసీదు తదితర ప్రాంతాల్లో సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు.

ఇదీ చదవండి:

అధికారుల ఒత్తిడి.. మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.