ETV Bharat / state

కడప వాసులకు చేరువైన శ్రీవారి లడ్డూ ప్రసాదం - తిరుమల శ్రీవారి లడ్డూ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కడప జిల్లా భక్తులకు చేరువైంది. లాక్​డౌన్ కారణంగా తిరుమలకు వెళ్లలేని భక్తులకు ప్రసాదం అందించాలనే ఉద్ధేశ్యంతో తితిదే ప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది. ఒక్కో లడ్డూ ధర రూ.25గా నిర్ణయించారు.

tirumala laddu is given to devotees in kadapa ttd kalyana mandapam
కడప వాసులకు చేరువైన శ్రీవారి లడ్డూ ప్రసాదం
author img

By

Published : May 25, 2020, 7:29 PM IST

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కడప వాసులకు చేరువైంది. లాక్​డౌన్ కారణంగా తిరుమలకు వెళ్లలేని భక్తులకు... కనీసం స్వామివారి ప్రసాదం అందించాలనే ఉద్దేశ్యంతో... తితిదే శ్రీవారి ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఆయా జిల్లాల్లో తిరుమల శ్రీవారి లడ్డూలను పంపిణీ చేస్తున్నారు.

కడప జిల్లాలోని తితిదే కల్యాణ మండపంలో... తిరుమల లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు 20 వేల లడ్డూలు సరఫరా చేశారు. ఒక్కో లడ్డూ ధర రూ.25తో విక్రయిస్తున్నారు. లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా కోరినన్ని లడ్డూలు విక్రయిస్తుండటం విశేషం.

ఇదీ చదవండి:

ముస్లింలకు నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.