ETV Bharat / state

వివాహేతర సంబంధముందనే అనుమానమే ఆ హత్యకు కారణం: సీఐ

కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లెలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే.. నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు.

murder case in tippireddypalli solved, illegal affair murder in tippireddypalli
తిప్పిరెడ్డిపల్లి హత్య కేసు, వివాహేతర సంబంధమే తిప్పిరెడ్డిపల్లి హత్యకు కారణం
author img

By

Published : May 12, 2021, 4:01 PM IST

కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లెకు చెందిన కైపు వెంకటేష్‌ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వెంకటేష్‌ అనే మరో వ్యక్తిని హంతకుడిగా గుర్తించి.. అరెస్ట్ చేశామని సీఐ బీవీ చలపతి వెల్లడించారు.

"ఈనెల 9వ తేదీన కైపు వెంకటేష్‌ను.. అదే గ్రామానికి చెందిన వెంకటేష్‌ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే హత్యకు కారణంగా తేలింది. నిందితుడు నేరం అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నాం" అని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

మామిళ్లపల్లె ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.