ETV Bharat / state

'కొత్త కర్మాగారాన్ని నిర్మిస్తామంటే అనుమానాలున్నాయి' - తులసి రెడ్డి ప్రెస్ మీట్

పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాయలసీమ పవర్​ ప్లాంట్​ను మూసివేయాలన్న ఆలోచనను తప్పుబట్టారు.

thulasireddy press meet in vempalli kadapa district
'కొత్త కర్మాగారాన్ని నిర్మిస్తామంటే ప్రజలకు అనుమానాలున్నాయి'
author img

By

Published : Dec 25, 2019, 7:17 PM IST

'కొత్త కర్మాగారాన్ని నిర్మిస్తామంటే అనుమానాలున్నాయి'

పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి... వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. కడప జిల్లాలో తన స్వగ్రామమైన వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నష్టాలు వస్తున్నాయనే సాకుతో రాయలసీమ పవర్​ ప్లాంట్​ను మూసివేయాలనో, లేక నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్​కు అమ్మాలనో ప్రభుత్వం ఆలోచించటం దురదృష్టకరమన్నారు. 3

రాయలసీమలో ఓల్టేజీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరించటానికి పవర్ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. రాయలసీమకే తలమానికంగా ఉండి ఎన్నోసార్లు జాతీయ స్థాయిలో అవార్డులు పొందిదని వివరించారు. నష్టాల సాకుతో పవర్​ప్లాంట్​ను మూసివేస్తూ... 15 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఆర్టీపీపీని మూసివేసి రాయలసీమకు ద్రోహం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: కనిపించని సిగ్నల్స్​... తప్పని ప్రమాదాలు.. ఎందుకంటే !

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.