ETV Bharat / state

ముగ్గురు యువకుల ప్రాణాలు బలిగొన్న చేపల వేట సరదా - three youngsters died while went for fishing

కడప జిల్లా ఎర్రగుంట్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు.. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

three died in kadapa district
ముగ్గురు యువకుల ప్రాణాలు బలిగొన్న చేపల వేట సరదా
author img

By

Published : Apr 6, 2021, 8:46 PM IST

కడప జిల్లా ఎర్రగుంట్ల నగరపంచాయతీ రాణివనానికి చెందిన ఏడుగురు యువకులు సరదాగా కదిరేవారి పల్లె రైల్వే గేటు దగ్గర ఉన్న నాపరాయి గనిలో చేపల వేటకు వెళ్లారు. మొదట సయ్యద్ (10) అనే బాలుడు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడ్డాడు. అతడిని కాపాడటానికి ప్రయత్నించి మరో ఇద్దరు యువకులు సైతం ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.

చనిపోయిన యువకుల్లో కృష్ణ చైతన్య (18) ఇంటర్మీడియట్ విద్యార్థి, కమల్ బాషా (19) ఐటిఐ చదువుకొని జీవన ఉపాధి కోసం ఆటో నడిపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది సాయంతో యువకుల మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎర్రగుంట్ల సీఐ సదాశివయ్య తెలిపారు.

ఇదీ చదవండి:

సీబీఐ విచారణ ఎందుకు వద్దనుకుంటున్నారు?: పట్టాభి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.