కడప జిల్లా రాజంపేట పట్టణం మండలంలోని బోయినపల్లి జాతీయ రహదారిపై ఆవులు గుంపులుగా తిరుగుతూ...రోడ్లపై ఉన్న పచ్చిగడ్డి తింటూ అక్కడే నిద్రిస్తుంటాయి. వాటిని పోషకులు కన్న బిడ్డల్లా చూసుకునే వారు...వర్షాభావం, పశుగ్రాసం ధరలు పెరగడం వంటి ఇతర కారణాలతో పశుపోషణ యజమానులకు భారంగా అయ్యి...ఫలితంగా ఆవులను రోడ్లపైకి వదిలేస్తున్నారు. ఫలితంగా.. అవి ప్రమాదాలకు గురై చనిపోతున్నాయి. వాటిని ఢీకొని వాహనదారులూ ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు.
వాహనచోదకుల తిప్పలు:
పగలు, రాత్రనక ఆవులు జాతీయ రహదారిపై చేరుతున్న కారణంగా.. వాహనచోదకులు నానా తిప్పలు పడుతున్నారు. వీధి దీపాలు సరిగ్గా లేని ఇలాంటి మార్గాల్లో.. రాత్రి సమయాల్లో దగ్గరకు వచ్చేవరకు అక్కడ పశువులు ఉన్నాయి అనే విషయం వాహనచోదకులకు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో పోలీసులు, పురపాలక అధికారులు, చర్యలు తీసుకుని పశువుల యజమానులతో మాట్లాడి వాటిని రోడ్లపైకి వదలకుండా చూడాలని... ఒకవేళ వారికి పశువులు భారమైతే గోశాలకైనా తరలించే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: