కడప జిల్లా ప్రొద్దుటూరు మిట్టమడి వీధిలో విషాదం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ పసి కందును గుర్తు తెలియని వ్యక్తులు కంపచెట్లలో వదిలి వెళ్లారు. శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తల్లి ఒడిలో ఉండాల్సిన బుజ్జాయిని ఇలా కంపచెట్లలో పడేయడానికి చేతులు ఎలా వచ్చాయంటూ విచారం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... శిశువును ఎవరు పడేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: