Leaders of the kapu community were furious with Kodali Nani : కాపులను దూషించిన కొడాలి నాని పై కడప జిల్లా టీడీపీ నాయకులు, బలిజ(కాపు) సంఘం నాయకులు మండిపడ్డారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక కోస్తామని హెచ్చరించారు. గుట్కాలు తింటూ లారీ డ్రైవర్గా పనిచేస్తూ నందమూరి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చిన కొడాలి నాని.. నందమూరి కుటుంబాన్ని దూషించడం దుర్మార్గమని వారు ఖండించారు. కొడాలి నానికి దమ్ము, ధైర్యం ఉంటే కడప జిల్లాకు రావాలని సవాల్ విసిరారు. కడప జిల్లా కాపులు అంటే ఏమిటో కొడాలి నానికి చూపిస్తామని హెచ్చరించారు. ఎక్కడో గదిలో కూర్చుని నలుగురిని చుట్టు పెట్టుకొని నోటికొచ్చినట్లు కాపులను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan Shoes Cost : పవన్ కల్యాణ్ 'బ్రో' షూస్ అంతా కాస్ట్లీనా!
కనీస అర్హత లేని వ్యక్తికి మంత్రి పదవి.. కడపలోని బలిజ సంఘ కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్ కొడాలి నాని పై మండిపడ్డారు. బలిజలకు కూడా మంత్రి పదవులు కావాలని బలిజలను ఎగతాళి చేసి మాట్లాడడం కొడాలి నాని కి తగదని ఖండించారు. వైఎస్సార్ పార్టీలో ఉన్న బలిజలు తక్షణం రాజీనామా చేసి బయటికి రావాలని డిమాండ్ చేశారు. కనీస అర్హత లేని వ్యక్తి కూడా మంత్రి పదవి కావడం ఆంధ్రప్రదేశ్ పట్టిన దౌర్భాగ్యం మండిపడ్డారు. విశాఖపట్నం కాపులు కొడాలి నాని వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తున్నారో తెలియదు గానీ కడప జిల్లా కాపులు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారని చెప్పారు.
KVS Bhaskar: "అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి".. ఎన్‌వీఎస్ 01 ప్రాజెక్టు డైరెక్టర్ విజయగాథ
జగన్ మోహన్ రెడ్డి పిచ్చికి పరాకాష్ట... జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరి తారాస్థాయికి చేరిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో తో వైఎస్సార్సీపీ నాయకులలో అలజడి మొదలైందని వారికి మతి భ్రమించి ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని విమర్శించారు. పెత్తందారులకు, పేదలకు మధ్య అనే పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి పిచ్చికి పరాకాష్ట అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే విషయం. పేద ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ పేదల పక్షాన ఉంటుందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కొడాలి నాని మరోసారి నోరు పారేసుకుంటే మాట్లాడేందుకు ఆ నోరు కూడా ఉండదని హెచ్చరించారు.
పోస్టాఫీసుల్లో భారీగా ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే జాబ్
ఎమ్మెల్యే కొడాలి నాని కల్లు తాగిన కోతి మాదిరిగా జే బ్రాండ్ తాగి మాట్లాడుతున్నాడు. మహానాడు, లోకేశ్ పాదయాత్ర దెబ్బకు మతి భ్రమించి ఓర్వలేక, దిక్కు తెలియక మాట్లాడుతున్నాడు. ఇంకా ఎక్కడైనా మాట్లాడితే నాలుక కోస్తాం. రాజకీయ భిక్ష పెట్టిన వారినే విమర్శిస్తే ఎట్లా. వారి పుణ్యాన్నే ఎమ్మెల్యే అయిన విషయాన్ని మర్చిపోతే ఎలా..? - హరి ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కడప
కొడాలి నాని, గుట్కా నాని కాపులను విమర్శించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. టీడీపీ నీడలో, చంద్రబాబు నాయుడు దగ్గర బతికి కాపులను తిట్టడం బాధాకరం. వైసీపీలో ఉన్న కాపులు బయటకు రావాలి. - శ్రీనివాసులు, బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి