The Central has banned the organizations involved in illegal activities: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొన్ని సంస్థలను నిషేధిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాల సంస్థలుగా కేంద్రం గుర్తిస్తూ కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ సంస్థలు, రిహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఇండియా ఫౌండేషన్, కేరళ వంటి సంస్థలను చట్టవిరుద్ధ కార్యకలాపాల సంస్థలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. అన్ లాఫుల్ యాక్టివిటీ, ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 27 సెప్టెంబర్ 2022న నిషేధం విధించిందని... ఇటువంటి సంస్థల కార్యకలాపాలు ఎవరైనా నిర్వహించినా, ప్రోత్సహించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: