ETV Bharat / state

భార్యతో సంబంధం పెట్టుకున్నాడని హత్య.. కేసు ఛేదించిన పోలీసులు - సుండుపల్లి వార్తలు

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని భర్త కాపు కాసి హత్య చేశాడు. ఆ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

kadapa district
హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం
author img

By

Published : Aug 2, 2020, 12:08 AM IST

కడప జిల్లా సుండుపల్లి మండలం శివరాంపురంలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఒక వ్యక్తిని భర్త కాపు కాసి హత్య చేశారు. పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ తెలిపిన వివరాల ప్రకారం ముడుంపాడు గ్రామానికి చెందిన మౌలాలి (28)కి పక్కనే ఉన్న శివరాంపురానికి చెందిన రామానుజులు (32) భార్యతో వివాహేతర సంబంధం ఉంది.

ఈలోపు గల్ఫ్ కు వెళ్లి వచ్చిన రామానుజులు ఒకసారీ మౌలాలిని మందలించాడని పేర్కొన్నారు. అయినా పట్టించుకోకపోవటంతో గత నెల 26వ తేదీన తాను ఊరు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లి కాపు కాశాడన్నారు. శివరాంపురం వద్ద మౌలాలిపై కత్తితో దాడి చేశాడని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మౌలాలి భయంతో పరుగులు తీసినా వెంటపడి దాడి చేయడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడని డీఎస్పీ పేర్కొన్నారు.

జులై 31వ తేదీన శివరాంపురం గ్రామ సమీపంలోని మామిడి తోట వద్ద నిందితుడు సంచరిస్తుండగా సుండుపల్లె పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుని వద్ద రక్తపు మరకలు కలిగిన మచ్చ కొడవలి స్వాధీనం చేసుకుని.. కోర్టులో హాజరుపరచినట్లు చెప్పారు.

ఇదీ చదవండి కేసీ కాల్వ ఆయకట్టుకు సాగునీరు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.