ETV Bharat / state

Tension in Pulivendula: వైసీపీ కార్యకర్తల కవ్వింపు చర్యలు.. పులివెందులలో ఉద్రిక్తత

tension in pulivendula
పులివెందులలో ఉద్రిక్తత
author img

By

Published : Aug 2, 2023, 5:26 PM IST

Updated : Aug 3, 2023, 6:21 AM IST

17:19 August 02

జెండాలు పట్టుకుని వచ్చి టీడీపీ శ్రేణుల వద్ద కేకలు వేసిన వైసీపీ కార్యకర్తలు

వైసీపీ కార్యకర్తల కవ్వింపు చర్యలు.. పులివెందులలో ఉద్రిక్తత

Tension in Pulivendula: వైఎస్సార్ జిల్లా పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన వేళ.. పులివెందుల పూలంగళ్లు సర్కిల్ వద్ద వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పులివెందుల పూలంగళ్లు సర్కిల్ వద్ద.. టీడీపీ శ్రేణులను వైసీపీ కార్యకర్తల రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఓపెన్ టాప్ జీప్​తో తెలుగుదేశం బహిరంగ సభ స్థలానికి చేరుకొని.. జెండాలు పట్టుకుని వచ్చి టీడీపీ శ్రేణుల వద్ద.. వైసీపీ కార్యకర్తలు కేకలు వేశారు. దీనితో తెలుగుదేశం శ్రేణులు తిరగబడ్డాయి. వారిని వెంటపడి తరమడంతో వైసీపీ కార్యకర్తలు వాహనంలో పారిపోయారు. కాగా కాసేపట్లో పులివెందుల పూలంగళ్లు సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్‌షో జరగనుంది. దీంతో పులివెందుల పూలంగళ్లు సర్కిల్ వద్దకు తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు భారీగా చేరుకున్నారు. పులివెందుల పసుపు మయంగా మారింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు గండికోట ప్రాజెక్టు ప్రాంతం నుంచి పులివెందుల బయలుదేరారు. తెలుగుదేశం శ్రేణులు అడుగడుగునా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికాయి.

Last Updated : Aug 3, 2023, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.