బద్వేలు ఉపఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే అధికార వైకాపా టికెట్ ఇవ్వటంతో.. ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించినట్లు తెదేపా తెలిపింది.
దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధాను.. బద్వేలు ఉపఎన్నికల అభ్యర్థిగా అధికార వైకాపా ఇప్పటికే ప్రకటించింది. తెదేపా తరఫున గతంలోనే డాక్టర్ రాజశేఖర్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇక భాజపా-జనసేన కూటమి తరఫున పోటీపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. నవతరం పార్టీ తరఫున ఇప్పటికే బద్వేలులో నామినేషన్ దాఖలైంది. వీళ్లు కూడా పోటీకి దూరంగా ఉంటే ఉపఎన్నిక ఏకగ్రీవం కానుంది. లేదంటే పోటీ జరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
KODALI NANI: పవన్ అరుపులకు బెదిరిపోయే ప్రసక్తేలేదు: కొడాలి నాని