ఈఎస్ఐ కుంభకోణంలో అధికార పార్టీ మంత్రి జయరాం, ఆయన తనయుడు ఈశ్వర్ లు లబ్ధి పొందారని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్, రాష్ట్ర తెదేపా సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని కాజేయాలని చూసిన వారిపై ఏసీబీ కేసు నమోదు చేయాలని కోరుతూ.. జిల్లా ఏసీబీ డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈఎస్ఐ కేసులో కావాలనే అచ్చెన్నాయుడుని ఇరికించారని తెలిపారు. ఈ కుంభకోణంలో మంత్రి తనయుడు ప్రమేయం ఉందని విమర్శించిన వారు.. దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇప్పటికే సమర్పించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి...