కడపజిల్లా మైదుకూరు నియోజక వర్గంలో పోలీసులు .. అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్, తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ఆరోపించారు. గ్రామాల్లో ఫ్యాక్షన్ పురిగొల్పే విధంగా డీఎస్పీ వ్యవహరిస్తున్నారని ఆయన కడపలో ఆక్షేపించారు. తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్.. వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చాలా గ్రామాల్లో పార్టీ మారాలని పోలీసులే బెదిరిస్తుండటం సిగ్గుచేటన్నారు. డీఎస్పీ వ్యవహార శైలిపై 2వ తేదీన డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. సెలవుల అనంతరం కోర్టులో పిటిషన్ వేస్తామని పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.
ఇదీచూడండి. ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి