ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక సమన్వయ కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. కడపలో ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా.. ఒక్క ఏపీలోని పరీక్షలు నిర్వహిస్తామని పట్టుబట్టడం సరి కాదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది పదోతరగతి పరీక్షలు రాస్తున్నారని.., వారిలో ఎవరికి కరోనా ఉందో! లేదో కూడా తెలియదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులందరికీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, శానిటైజర్, మాస్కులు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇన్విజిలేటర్లు వస్తారని .. వారిలో ఎవరికి కరోనా ఉందో తెలియదని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రద్దు చేసి.. అందరిని పాస్ చేయించాలని కోరారు.
ఇదీ చూడండి. ఐఐఎం డోనేషన్ కట్టేందుకు విద్యార్థికి దాతల సాయం