ETV Bharat / state

కడప జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

కడప జిల్లాలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కడప జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
కడప జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
author img

By

Published : May 28, 2021, 8:02 PM IST

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసంక్షేమమే తెదేపా లక్ష్యమని ఆ పార్టీ నేత గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతిని పురస్కరించుకుని కడపలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. మహిళలకు చీరల పంపిణీ చేశారు. విలేకరులకు సన్మానం చేసి, చంద్రబాబు నాయుడు పంపిన అభినందన పత్రాన్ని అందజేశారు. రాజంపేట బైపాస్ రోడ్​లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతికాలంలోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్​కే దక్కుతుందని పార్టీ నేతలు అన్నారు.

ఇదీచదవండి.

ఇకపై అలా చేస్తే.. క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్ కింద కేసులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.