రోడ్డు విస్తరణ పేరుతో బాధితులకు పరిహారం ఇవ్వకుండా ఇళ్లు పడగొట్టేందుకు అధికారులు దౌర్జన్యం చేయడం ఏంటని తెదేపా నేతలు ప్రశ్నించారు. కడపలో కలెక్టరేట్ నుంచి రిమ్స్ వైపు వెళ్లే రహదారి విస్తరణలో భాగంగా... రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఇళ్లు, దుకాణాలు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా కూల్చివేస్తుండటంతో బాధితులు, తెదేపా నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ముఖ్యమంత్రి అతిథి గృహానికి వెళ్లే రహదారిని... 100 అడుగుల వెడల్పుతో విస్తరణ చేపడుతున్నారు. పరిహారం ఇస్తామన్న అధికారులు... ఇప్పటికిప్పుడే ఇళ్లను కూల్చేందుకు యత్నించడం సరైన పద్దతి కాదని తెదేపా నాయకులు మండిపడ్డారు.
ఇదీ చదవండి: