ప్రభుత్వం వ్యవహరించే తీరు చూసి ప్రజలు వైకాపాకు ఎందుకు ఓటు వేశామని బాధ పడుతున్నారని తెదేపా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి అన్నారు. కడపలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 8 నెలల వైకాపా పాలన అన్ని రంగాల్లో విఫలం చెందిందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల్లో చెప్పి అధికారంలోకి వచ్చి ఆ అంశాన్ని మరిచారని విమర్శించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మేనిఫెస్టోలో లేని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అమరావతిలో కాదని విశాఖలో అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి : లైవ్ అప్డేట్స్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు