'తప్పులు సరిదిద్దుకోండి...వరద బాధితుల్ని ఆదుకోండి' సామర్థ్యానికి మించి నీటిని నిల్వ చేయడం వల్లే వరదలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెదేపా బద్వేల్ నియోజకవర్గ బాధ్యుడు, డాక్టర్ రాజశేఖర్ ఆరోపించారు. విజయవాడలో చంద్రబాబు నాయుడు ఇల్లు మునగాలనే దురుద్దేశంతోనే మూడున్నర టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రకాశం బ్యారేజీలో నాలుగు టీఎంసీల నీరు చేరేవరకూ గేట్లు ఎత్తలేదన్నారు. వరద నీటిని సద్వినియోగం చేసుకోవడమెలాగో ప్రభుత్వానికి తెలియకపోవడం వల్ల.. రాయలసీమకు నీరు లేకుండా పోతోందని చెప్పారు.
ఇదీ చూడండి:'చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన లేదు'