ETV Bharat / state

Chandrababu Tour: వరద బాధితులకు అండగా ఉంటామన్న చంద్రబాబు.. నేడు చిత్తూరులో పర్యటన - Chandrababu Tour

అన్నమయ్య జలాశయం కింద ప్రాణనష్టానికి మానవ వైఫల్యమే కారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా లేనందునే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. మృతులకుటుంబాలకు విశాఖ ఎల్​జీ పాలిమర్స్‌ ప్రమాదం తరహాలో పరిహారం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతున్న సీఎంను నేలకు దించాలన్నారు. ఇవాళ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, శ్రీకాళహస్తి తిరుపతి నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు.

chandrabu today tour
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
author img

By

Published : Nov 24, 2021, 4:45 AM IST

Updated : Nov 24, 2021, 7:23 AM IST

వరద బాధితులకు అండగా ఉంటామన్న చంద్రబాబు

కడప జిల్లా రాజంపేట, నందలూరు మండలాల్లో వరద బీభత్సానికి దెబ్బతిన్న గ్రామాలను, వరదల్లో మృత్యువాత పడిన బాధిత కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఉదయం కడప విమానాశ్రయం(TDP chief Chandrababu visited ) నుంచి ప్రారంభమైన చంద్రబాబు పర్యటన.. రాత్రి 9 గంటల వరకు సాగింది. కడప విమానాశ్రయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానాలు తరలివచ్చి స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన వెళ్లి రాజంపేట మండలం మందపల్లె, పులపుత్తూరు, గుండ్లూరు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. మందపల్లె, పులపుత్తూరు గ్రామాల్లో అధికారికంగా ఇప్పటివరకు 19 మంది మృతదేహాలను గుర్తించారు. మందపల్లెలో ఒకే కుటుంబంలో ఏడుగురు మృత్యువాత పడిన బాధిత కుటుంబం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామాల్లో కలియ తిరుగుతూ... చెయ్యేరు నది ఉద్ధృతికి గురైన పంటలను పరిశీలించారు. నది ఒడ్డునే ఊరు ఉండటం.. ప్రవాహానికి సంబంధించి అధికారుల నుంచి సమాచారం లేకపోవడంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

సీఎం గ్రామాల్లో తిరగకుండా గాల్లో తిరిగి వెళ్లిపోయారు..

గత ఏడాదే పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయినపుడే మేల్కోని ఉంటే ఇపుడు ఈ తప్పిదం జరిగేది కాదని అన్నారు. ప్రకృతి వైపరిత్యాలను ఎవరూ ఆపలేరు.. కానీ ముందస్తుగా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు విమర్శించారు. దానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న తెదేపా అధినేత.. జరిగిన ప్రాణ నష్టంపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. తాను హుద్ హుద్ తుఫాను వచ్చినపుడు 8 రోజుల పాటు విశాఖలోనే ఉండి పునరుద్ధరణ పనులు పూర్తి చేసే వరకు నిద్రపోలేదన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్ గ్రామాల్లో తిరగకుండా గాల్లో తిరిగి వెళ్లిపోయారని విమర్శించారు.

40 మంది వరకు వరదల వల్ల చనిపోయినట్లు అంచనా ఉందన్న బాబు.. మృతుల కుటుంబాలకు విశాఖ పాలిమర్స్ తరహాలోనే కోటి రూపాయల చొప్పున పరిహారం(chandrababu demand ex gratia to floods victims) ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ తరపున మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున పరిహారం, ఇళ్లు కోల్పోయిన వారికి 5 వేల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇపుడున్న అన్నమయ్య ప్రాజెక్టును మళ్లీ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తే.. ప్రజలకు పునరావాసం కల్పించడం లేదంటే, ప్రాజెక్టుకు సిమెంట్ కాంక్రీటుతో రక్షణ గోడలు నిర్మించడం వంటి శాశ్వత చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్​ చేశారు. లేదంటే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పని తామే చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మందపల్లె గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. భారీగా ప్రాణ, ఆస్థినష్టం జరిగినా అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.

నేడు చిత్తూరు పర్యటన..

ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లో చంద్రబాబు కలియతిరిగారు. రెండు గ్రామాలకే ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించారు. రాత్రి రాజంపేటలో కూడా ప్రజలను ద్దేశించి మాట్లాడిన ఆయన..జగన్‌ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరోసారి చంద్రబాబు గుర్తు చేశారు. రాత్రి రేణిగుంటలో బసచేసిన చంద్రబాబు.. ఇవాళ చిత్తూరు జిల్లాలోని(chandrababu tour in Chittoor district tour) చంద్రగిరి, శ్రీకాళహస్తి తిరుపతి నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని శపథం చేసిన చంద్రబాబు... ఆ పని ముఖ్యమంత్రి జగన్ సొంతజిల్లా కడప నుంచే ప్రారంభించినట్లు కనిపించింది.

ఇదీ చదవండి..

Amaravati Padayatra: సంకల్పం సడల లేదు..జోరు తగ్గలేదు..సమరోత్సాహంతో రైతు పాదయాత్ర

Last Updated : Nov 24, 2021, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.