కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని కమ్మపల్లి హరిజనవాడలో తమిళనాడుకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పంట పొలాల్లో బోరు వేసేందు లారీని తీసుకొచ్చారు. బోరు బండికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలు తొలిగిస్తుండగా వాహనంలో ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డాక్టర్ నాయక్ తెలిపారు.
ఇవీ చూడండి... సిరులిచ్చే ఎర్రబంగారం మొక్కలు.. వర్షం కురిస్తే ఉచితంగా పంపిణీ