కడప జిల్లా రాజంపేటలోని మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏకలవ్య మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో తైక్వాండో బెల్ట్ టెస్ట్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు బెల్ట్ టెస్ట్ నిర్వహించి వారి నైపుణ్యాల ఆధారంగా బెల్టులను అందజేశారు. తరగతి నుంచే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం నింపే మార్షల్ ఆర్ట్స్‌ని నేర్పించాలని రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి భానుమూర్తిరాజు అన్నారు. తద్వారా విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉంటారని చెప్పారు. నేడు మార్షల్ ఆర్ట్స్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రీడాకారులు తర్ఫీదు పొందాలని తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చైతన్య కుమార్ సూచించారు.
రాజంపేటలో తైక్వాండో బెల్ట్ టెస్ట్ - Taekwondo Belt Test latest news in kadapa
కడప జిల్లా రాజంపేటలో ఏకలవ్య మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో తైక్వాండో బెల్ట్ టెస్ట్ నిర్వహించారు. బాలికలలో ఆత్మస్థైర్యం నింపేందుకు తైక్వాండో లాంటివి ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి భానుమూర్తిరాజు అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు బెల్ట్ టెస్ట్ నిర్వహించి వారి నైపుణ్యాల ఆధారంగా బెల్టులను అందజేశారు.
కడప జిల్లా రాజంపేటలోని మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏకలవ్య మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో తైక్వాండో బెల్ట్ టెస్ట్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు బెల్ట్ టెస్ట్ నిర్వహించి వారి నైపుణ్యాల ఆధారంగా బెల్టులను అందజేశారు. తరగతి నుంచే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం నింపే మార్షల్ ఆర్ట్స్‌ని నేర్పించాలని రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి భానుమూర్తిరాజు అన్నారు. తద్వారా విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉంటారని చెప్పారు. నేడు మార్షల్ ఆర్ట్స్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రీడాకారులు తర్ఫీదు పొందాలని తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చైతన్య కుమార్ సూచించారు.
ఇదీ చూడండి: 'ఒత్తిడిని జయించాలంటే క్రీడల్లో ప్రోత్సహించాలి'