బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో వైకాపా ప్రభుత్వంపై భాజపా రాజకీయ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. బద్వేల్‌లో ఇసుమంత అభివృద్ధి అయినా చేశారా? అని జగన్ సర్కార్‌ను భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ ప్రశ్నించారు. నవరత్నాలతో ప్రజలకు లబ్ధి జరగట్లేదని ఆరోపించారు.
అభివృద్ధిని గాలికొదిలిన వైకాపాకు ఓటేస్తారా? లేక అభివృద్ధి చేసే భాజపాకు ఓటేస్తారా? అని ఆలోచించుకోవాలని ప్రజల్ని కోరారు. అభివృద్ధి కావాలా? మభ్యపెట్టేవారు కావాలో తేల్చుకోవాలని అన్నారు. దొంగఓట్లలో ఆరితేరిన పెద్దిరెడ్డితో ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: Somu Veerraju: 'రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని భాజపా ప్రోత్సహించదు'