ETV Bharat / state

JOB CALENDER: కడపలో విద్యార్థుల అర్థనగ్న ప్రదర్శన - కడప జిల్లా ప్రధాన వార్తలు

పాత ఉద్యోగ క్యాలెండర్​ను రద్దు చేసి కొత్త ఉద్యోగాల క్యాలెండర్​ను విడుదల చేయాలని కోరుతూ కడప కోటిరెడ్డి కూడలిలో విద్యార్థులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కడపలో విద్యార్థుల అర్థనగ్న ప్రదర్శన
కడపలో విద్యార్థుల అర్థనగ్న ప్రదర్శన
author img

By

Published : Jul 11, 2021, 10:39 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీలోపు కొత్త ఉద్యోగ క్యాలెండర్​ను విడుదల చేయకుంటే 19వ తేదీ ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. పాత క్యాలెండర్​ను రద్దు చేసి కొత్త ఉద్యోగాల క్యాలెండర్​ను విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి కూడలి వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

వైకాపా సర్కార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 లక్షల 30 వేల ఉద్యోగాల జాబితాను విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి... కేవలం 10 వేల ఉద్యోగాలను మాత్రం విడుదల చేయడం దారుణమని మండిపడ్డారు. ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి నట్టేట ముంచేశాడని ఆరోపించారు. తక్షణం కొత్త ఉద్యోగాల జాబితా విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'మంత్రుల సంఖ్య మాత్రమే పెరిగింది.. వ్యాక్సిన్లు కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.