ETV Bharat / state

విద్యార్థిని ఆత్మహత్యపై బంధువుల ఆందోళన - student dies at adarsha school kadapa latest news

కడప జిల్లా పుల్లంపేట ఆదర్శ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై... ఆమె బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిని వదిలిపెట్టొద్దని... న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు
author img

By

Published : Nov 20, 2019, 8:22 PM IST

విద్యార్థిని ఆత్మహత్యపై బంధువుల ఆందోళన

కడప జిల్లా పుల్లంపేటలోని ఆదర్శ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై... చిన్నారి బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని కుటుంబసభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. పాఠశాలలో శివ అనే ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసన్నను మందలించాడని... మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడిందని మానవ హక్కుల సంఘం జిల్లా నాయకురాలు జయశ్రీ ఆరోపించారు.

తమ బిడ్డ చావుకు కారణమైన వారిని వదిలిపెట్టొద్దని... క్షమాపణ చెప్పాలని లక్ష్మీప్రసన్న బంధువులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి... నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని... సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: విద్యార్థులున్నా... వసతులు సున్నా..!

Intro:Ap_cdp_47_20_jatiya rahadaaripai_badhitula andolana_stambinchina_rakapakalu_Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా పుల్లంపేట ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని లక్ష్మి ప్రసన్న ఆత్మహత్యపై బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేయడంతో వాహనాల రాకపోకలు గంటన్నరపాటు స్తంభించిపోయాయి. ఆదర్శ పాఠశాలలో శివ అనే ఉపాధ్యాయుడి ఘాతుకానికి లక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థిని బలి అయిందని మానవ హక్కుల సంఘం జిల్లా నాయకురాలు జయశ్రీ ఆరోపించారు ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్, విద్యార్థులతో ఆమె మాట్లాడారు. పోస్టుమార్టం అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు, ఏబీవీపీ, అంబేద్కర్ సంఘం, పి డి ఎస్ యు తదితర విద్యార్థి సంఘాలు సంఘీభావంగా ఆందోళనకు దిగారు. మా బిడ్డని పొట్టనబెట్టుకున్న ఉపాధ్యాయుడిని తీసుకురావాలని, క్షమాపణ చెప్పించాలని ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రహదారిపై భీష్మించి కూర్చున్నారు. ఒకవైపు బాధితులు జాతీయ రహదారిపై అయింది గా మరోవైపు విద్యార్థి సంఘాలు ఆదర్శ పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో ఆందోళన అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైనది. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న డి.ఎస్.పి నారాయణస్వామిరెడ్డి కల్పించుకొని ఆర్డీవోతో బాధితుల్ని మాట్లాడించారు. ఇలా ఆందోళన జరుగుతున్న సమయంలో అంబులెన్స్ రావడంతో ఆందోళన విరమించి వాహనానికి దారిచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సమగ్ర విచారణ జరిపిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. దీంతో అసంతృప్తిగానే ఆందోళనను విరమించారు.

Body:జాతీయ రహదారిపై బాధితులు విద్యార్థి సంఘాల ఆందోళన

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.