కడప జిల్లా రాజంపేటలో యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివిన పావని ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. అయితే తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై ప్రతాప రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి :